ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వద్దు…
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆయకట్టు రైతులకు సంబంధించి సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వద్దని రైతులు రహదారి నిర్మాణ అధికారులను కోరారు. ఈ సందర్భంగా రైతులు రారావి యల్లప్ప, లక్ష్మన్నలు మాట్లాడుతూ మండల పరిధిలోని వన్నూరు క్యాంప్ గ్రామానికి నూతనంగా నిర్మాణం చేపడుతున్న రహదారి పనులలో భాగంగా రహదారికి అడ్డంగా ఎల్ఎల్సి డిస్ట్రిబ్ర్యూటరీ 56వ డిపి కి సంబంధించి రైతులకు సాగునీరు అందుతుంది. నూతన రోడ్డు నిర్మాణం పనులలో భాగంగా నూతనంగా కల్వర్టును నిర్మాణం చేపట్టి రైతులను ఆదుకోవాలని అన్నారు. కల్వర్టు నిర్మాణం లేకపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా ఈ రహదారిపై రైతులు, వ్యాపారస్తులు తాము పండించిన పంటను కర్ణాటక ప్రాంతానికి సిరుగుప్ప, సిందనూరు పట్టణాలకు వెళ్లేందుకుఈ రోడ్డు మార్గాన లారీలు, ట్రాక్టర్లు భారీగా రాకపోకలు జరుగుతుండడంతో రైతులకు ఇబ్బంది లేకుండా కల్వర్టు నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు. ఆదివారం గుత్తేదారులు స్థలాన్ని పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్తా మన్నారు. ఈ కార్యక్రమంలో 56వ డిస్ట్రిబ్ర్యూటరీ కి సంబంధించిన రైతులు తదితరులు పాల్గొన్నారు.