వైయస్సార్ విగ్రహాన్ని తొలగించొద్దు
1 min readవైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కొందరు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తొలగించమని వైస్ ఛాన్స్లర్ కు వినతి పత్రం అందించడం బాధాకరమని వైఎస్ఆర్సిపి జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి అన్నారు, గురువారం ఆయన చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, ఒకప్పుడు యోగి వేమన విశ్వవిద్యాలయం కడప జిల్లాకు వచ్చేందుకు ఎంతో కృషి చేయడంతో పాటు, విద్యా వ్యవస్థకు ఆయన చేసినటువంటి కృషి మరువలేనిదని ఆయన అన్నారు, అలాంటి మహానుభావునికి ఆనాడు పలాభిషేకం చేసిన యోగి విశ్వవిద్యాలయంలో నేడు ఆయన విగ్రహాన్ని తొలగించాలని కోరడం దుర్మార్గమని ఆయన అన్నారు, రాజకీయాలలో విద్యా వ్యవస్థను బ్రస్ట్ పట్టించే విధంగా ఉండరాదని, నేడు ఒక పార్టీ అధికారంలో ఉంటే, మరోసారి ఇంకో పార్టీ అధికారంలోకి రావడం సహజమని అలాంటి పరిస్థితులలో ఇలాంటి నాయకుల విగ్రహాలు కూల దోయాలని కోరడం సమంజసం కాదని ఆయన తెలిపారు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతోమంది విద్యార్థుల కల నెరవేర్చి వారి ఉన్నతాభివృద్దికి దోహద్ద పడిన వ్యక్తని ఆయన కొనియాడారు, డాక్టర్ వైయస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి నేడు మంచి మంచి పదవులలో హోదాలలో ఉన్నారని ఆయన గుర్తు చేశారు, ఆయన విద్యా రంగానికి చేసినటువంటి కృషి చిరస్థాయిగా నిలిచిపోయాయని, అలాంటి వ్యక్తి విగ్రహాన్ని తొలగించాలాని కోరడం మానుకోవాలని ఆయన కోరారు.