అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు..
1 min readపాణ్యం సీఐ. కిరణ్ కుమార్ రెడ్డి.
పల్లెవెలుగు న్యూస్ గడివేముల : ఫ్యాక్షన్ గ్రామాలలో గొడవలకు దూరంగా ఉండాలని ఫ్యాక్షన్ జోన్ సీఐ ప్రభాకర్ రెడ్డి పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి మండలంలోని ఫ్యాక్షన్ గ్రామమైన పెసరావాయి గ్రామంలో సోమవారం నాడు గ్రామ సభ నిర్వహించారు కక్షలతో సాధించేది ఏమీ లేదని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని అన్నారు. గ్రామంలో అందరూ ఐక్యమత్యంగా ఉండి గ్రామన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. గ్రామంలో ఎవరైనా కొత్తవారు కనిపిస్తే పోలీసువారికి సమాచారం అందించాలని తెలిపారు. ఎవరైనా గ్రామాలలో పేకాట, మట్కా, బెల్ట్ షాపులు, నాటు సారా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులపై మరియు హాస్టల్లో చదివే విద్యార్థులపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని తెలిపారు. గ్రామంలో రౌడీ షీటర్లు ప్రవర్తన మార్చుకోవాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామంలోని ఏమైనా సమస్యలు ఉంటే పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్షన్ జోన్ సీఐ ప్రభాకర్ రెడ్డి,ఎస్సై నాగార్జున్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, పాల్గొన్నారు.