రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పల్లెల్లో అదేపనిగా కార్యాలయాల చుట్టూ రైతులను తిప్పుకోవద్దని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయ సూర్య అన్నారు. ఆదివారం ఉదయం నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జయసూర్య పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నీళ్లు లేక రైతులు అల్లాడిపోయారని మల్యాల,ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయుటకు టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి మాండ్ర శివానందరెడ్డి ఈ ప్రాజెక్టులను పూర్తి చేయించారని అన్నారు. రైతులకు రెండు కార్ల పంటలకు పుష్కలంగా నీళ్లు ఇచ్చేందుకు మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉద్యాన శాఖ ఏఓ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని మా దృష్టికి వచ్చిందని అధికారులందరూ తప్పనిసరిగా కార్యాలయాల్లో రైతులకు అందుబాటులో ఉండాల్సిందేనని అన్నారు. అనంతరం రైతులకు విత్తనాల ప్యాకెట్లను ఎమ్మెల్యే మరియు శివానందరెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్న నాగ లక్ష్మయ్య, మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,గుండం రమణారెడ్డి,మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి, ఏడిఏ విజయ శేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.