దోసపాడు దళితులకు పేదలకు న్యాయం చేయాలి
1 min readదోసపాడు పేదలు,దళితులకు ఫ్యామిలీ సర్టిఫికెట్స్ చనిపోయిన వారికి మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: దోసపాడు దళితులకు అర్హులైన అసైన్డ్దారులకు ఫ్యామిలీ సర్టిఫికెట్స్ మరియు చనిపోయిన వారికి మరణ ధ్రువీకరణ పత్రాలు వారి వారసులకు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ డిమాండ్ చేశారు.బుధవారం నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద డిఆర్ఓ విశ్వేశ్వర రావుకి వ్యవసాయ కార్మిక సంఘం మరియు దోసపాడు భూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దోసపాడులో దళితులు పేదలు గత రెండు సంవత్సరాలపైగా వారి యొక్క అసైన్డ్,సీలింగ్ భూములు పంచాలని ఆక్రమించుకున్న అక్రమ దారుల నుండి వారికి రక్షణ కల్పించాలని, భూములలో సాగుకు అవకాశం కల్పించాలని పోరాడుతున్న మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. తాతలు తండ్రులు చనిపోతే వారికి వారసులుగా ఉన్న మాకు చనిపోయిన వారి మరణ ధ్రువీకరణ పత్రాలు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక సార్లు రెవెన్యూ శాఖ అధికారులు కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగిన నేటికీ సమస్య పరిష్కారం కాలేదని దూయ్యాబెట్టారు. ఇప్పటికైనా మీరు (ప్రభుత్వం )స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. పేదలు అడుగుతున్న పట్టాలు, పాసుబుక్ వారి వారసులుగా గుర్తించడానికి ఫ్యామిలీ సర్టిఫికెట్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములు చట్టం ప్రకారం అర్హులైన పేదలందరికీ భూ పంపిణీ ద్వారా భూములు పంపిణీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ సమస్యలు పరిష్కారాలు వంటి కార్యక్రమంలో ఈ ప్రస్తావన అసలు రావడం లేదని విమర్శించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఏలూరు జిల్లాలో భూములు సమస్యలు లేవని ప్రకటన చేయడం ఆస్యాస్పదంగా ఉందన్నారు. కానీ ఈ జిల్లాలో లక్షలాది ఎకరాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని మండిపడ్డారు. తూ తూ మంత్రంగా రెవిన్యూ సదస్సు గ్రామాల్లో నిర్వహిస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. భూ సమస్యకు ఉన్న దానికి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో అధికారులు ఆ సమస్యను ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ అన్నట్లుగా పరిష్కారం చేయకుండా తాస్సారం చేస్తున్నారని దియబట్టారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ రెవెన్యూ సదస్సులు సక్రమంగా జరపాలని అర్హులైన పేదలందరికీ భూ పంపిణీ ద్వారా భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎం దోసపాడు లాంటి గ్రామాల్లో దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనవరి 15 నుండి జరిగే భూ పోరాటంలో అధికారులు ప్రజాప్రతినిధులు రాబోయే కాలంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని హెచ్చరించారు. అనంతరండిఆర్ఓ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఈ సమస్య మండల తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్తానని వారి చేత పని జరిగేలా మీకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అంతగాని ఆనందరావు, డి నాగేంద్ర తో పోరాట నాయకులు రాజు, భూషణం లక్ష్మి, మాణిక్యం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.