PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్రంలో..డబుల్​ ఇంజన్​ సర్కారు…

1 min read

ఏపీలో కూటమి ప్రభుత్వం ఖాయం…

  • అవినీతి జగన్​ సర్కారును తరిమికొట్టండి…
  •  ఆదోని అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయిస్తే… తిరిగి పంపారు…
  • కూటమి అభ్యర్థి డా. పార్థసారధి, ఎంపీ అభ్యర్థి నాగరాజును గెలిపించండి..
  • _  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్

ఆదోని, పల్లెవెలుగు:సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుపొంది… దేశ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో డబుల్​ ఇంజన్​ సర్కారును ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. అవినీతిమయమైన జగన్​ సర్కారును తరిమికొట్టాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం  ఆదోని పట్టణలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పర్యటించారు. ఆర్ట్స్ కళాశాల నుండి భీమాస్  కూడలి వరకు రోడ్  షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖామంత్రి  రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ ఏపీలో  ల్యాండ్ , హ్యూమన్ ట్రాఫికింగ్ , మైనింగ్ మాఫియాలు  స్వైర విహారం చేస్తున్నాయని ఆరోపించారు. జగన్ సర్కార్ అవినీతి ఆరోపణలలో పూర్తిగా కూరుకుపోయిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజు త్వరలోనే ఉందన్నారు.

కూటమి అభ్యర్థి డా. పార్థసారధిని గెలిపించండి…

ఈనెల 13న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి  పార్థసారథిని , కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి  బస్తిపాటి నాగరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందనీ జోస్యం చెప్పారు. భారతీయ జనతా పార్టీ  జమిలి ఎన్నికలపై మొగ్గు చూపుతుందని, ,దీని వలన ఖర్చు తగ్గుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్రం నిధులతో ఆంధ్ర ప్రదేశ్ ను అన్నివిధాల అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్నో  నిధులు మంజూరు చేసినప్పటికీ  జగన్ మోహన్ రెడ్డి  ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అన్ని తానే చేస్తున్నట్లు చెప్పుకోవడం దారుణమన్నారు.

 ఆదోని అభివృద్ధిపై… స్పష్టమైన హామీ…

 పట్టణంలో మంచి నీటి సౌకర్యం కోసం అమృత పథకం కింద ఆదోని కి 400 కోట్లు ఇస్తే సద్వినియోగం చేసుకోకుండా, ఆ నిధులను తిరిగి పంపారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి అభ్యర్థులు గెలిస్తే ఇంటింటికీ మంచినీటి సౌకర్యం,మరుగుదొడ్లు,పక్క ఇల్లు కట్టిస్తామని హామీనిచ్చారు.  కూటమి అభ్యర్థి డా. పార్థసారధిని గెలిపిస్తే.. ఆదోని అభివృద్ధిలో పరుగులు తీస్తుందని పేర్కొన్నారు.

కార్యకర్తలతో…పార్థసారధి చిందులు…

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ పర్యటనతో  ఆదోనిలో కూటమికి బలం పుంజుకుంది. ఆదోని అభివృద్ధికి కేంద్ర మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వడంతో అటు ప్రజల్లోనూ… ఇటు కార్యకర్తలు, నాయకుల్లోనూ జోష్​ నిండింది.  కేంద్రమంత్రి పర్యటన అనంతరం బీజేపీ అభ్యర్థి  డా. పార్థసారథి కార్యకర్తలతో చిందులు వేయడంతో కేరింతలతో దద్దరిల్లింది. కార్యక్రమంలో, టీడీపీ మాజీఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, జనసేన ఇన్చార్జి మల్లప్ప,బిజెపి కేంద్ర సభ్యులు ,మాజీ ఎంపీ టి జి వెంకటేష్, విట్టా రమేష్ పాల్గొన్నారు.

About Author