PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘డబుల్ఇస్మార్ట్’ జితెలుగులో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు  

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన మాస్ఎంటర్టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను ఈ వారం వరల్డ్ టెలివిజన్ ప్రిమియర్ గా జి తెలుగులో ఈ ఆదివారం(అక్టోబర్ 27న) సాయంత్రం 6 గంటలకు,ప్రదర్శన కానుంది.పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ అంతర్జాతీయ మాఫియా డాన్ బిగ్ బుల్ (సంజయ్ దత్) చుట్టూ తిరుగుతుంది. అతను గ్లియోమా నిర్ధారణ అయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి ఆరాటపడతాడు. అతని జ్ఞాపకశక్తిని మరొకరి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతను అమరుడవుతాడని ఒక శాస్త్రవేత్త సూచించడంతో అందుకు సరిపోయే వ్యక్తి కోసం అన్వేషణ మొదలవుతుంది. ఆ అన్వేషణలో హైదరాబాద్ లోని శంకర్ (రామ్ పోతినేని)సరైన వ్యక్తిగా గుర్తించడంతో బిగ్ బుల్ మెమరీ ట్రాన్స్ ఫర్ జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుందనే విషయం తెలియాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే డబుల్ ఇస్మార్ట్ సినిమా చూడాల్సిందే. రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, గెటప్ శ్రీను, అలీ, షాయాజీ షిండే, ఝాన్సీ  వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. యాక్షన్, కామెడీ, థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ మాస్ఎంటర్టైనర్ని జీ తెలుగు వేదికగా ఈ ఆదివారం మీరు తప్పకుండా చూడండి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *