PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొనసాగిస్తారా ఆపేస్తారా.. గ్రామ సచివాలయాల నిర్మాణం పై సందిగ్ధం.?

1 min read

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 38;

పల్లెవెలుగు వెబ్ గడివేముల: రాష్ట్రంలో వింత పరిస్థితి నెలకొంది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతున్న వేళ గత ప్రభుత్వాలు అభివృద్ధి పనులతో చేపట్టిన నిర్మాణాలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనే సందిగ్ధం ఏర్పడింది ..2014 లో టిడిపి ప్రభుత్వ హయాంలో  ప్రజలు తమ సమస్యలు చెప్పటానికి రాజధానికి వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కి ప్రజలకు వేదికగా  నిర్మించిన ప్రజావేదిక 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూల్చేసింది.. మరి 2024 లో భారీ మెజార్టీతో ప్రజలు టిడిపి కూటమికి అధికారం కట్టబెట్టారు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో  గ్రామ స్వరాజ్యం అంటూ గ్రామాలలో గ్రామ సచివాలయ నిర్మాణాలను మొదలుపెట్టారు .. 2500 ఆపై జనాభా ఉన్న గ్రామంలో గ్రామ సచివాలయ నిర్మాణం కొనసాగింది..  అయితే నిధులు లేమితో కొన్నిచోట్ల గ్రామ సచివాలయాలు గత ఐదు సంవత్సరాల నుంచి నత్త నడకన సాగిన నిర్మాణాలు కొన్నిచోట్ల కాంట్రాక్టర్లకు బిల్లులు అందక ఆగిపోయాయి అయితే ప్రభుత్వం మారడంతో మళ్లీ సమీక్ష చేసి వీటిని నిర్మాణాలను కొనసాగిస్తారా లేదా అనే సందిగ్ధం నెలకొంది?? గతంలోనే టిడిపి ప్రభుత్వం వచ్చిన వైసిపి ప్రభుత్వం కొనసాగించిన నిర్మాణాలను ప్రజా ఉపయోగాలకు ఉపయోగించుకుంటామని అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడంతో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించి నిర్మాణాలను కొనసాగించాలని ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

About Author