డా బి.ఆర్ అంబేద్కర్ ..డా.. బాబు జగ్జీవన్ రామ్ సర్కిల్ ఏర్పాటు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం హెబటం గ్రామమునందు ఆ గ్రామ ప్రజలు మరియు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పక్కిరప్ప మాదిగ మరియు సీనియర్ నాయకులు మల్లికార్జున మాదిగ నారాయణ మాదిగ ఆ గ్రామ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సర్కిల్ ఏర్పాటు విషయములో శంకు స్థాపనచేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జిల్లా నాయకులు బండారి హనుమంతు మాదిగ మరియు గ్రామ సర్పంచ్ నరసప్ప ఎంపీటీసీ ఉరుకుందప్ప వైస్ ఎంపీపీ తనయుడు కంచప్ప గుబ్బల లక్ష్మయ్య కురకుంద సవరప్ప చేతులు మీదుగా రిబ్బన్ కటింగ్ నిర్వహించడం జరిగినది ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు హెబ్బటం రాజు మాదిగ బండారి గిడ్డయ్య మాదిగ కాంత రాజ్ దత్తు మాదిగలు అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా నాయకులు బండారి హనుమంతు మాదిగ మరియు ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజమంతా ఐక్యమత్యంతో ఉండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలంతా మహాజనులుగా వర్ధిల్లాలని ఒకరి పట్ల ఒకరికి సోదర భావం కలిగి ఉండాలని ప్రతి ఎస్సీ ఎస్టీ సోదరులతో పాటు బీసీ మైనార్టీ సోదరులు కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దళిత బడుగు బలహీన వర్గాల కు ఏమి సాధించారని పూర్తిగా అధ్యాయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆ మహనీయులు మనకు చేసిన మేలు ఎన్నటికీ మరిచిపోలేనిది అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు 15 శాతం రిజర్వేషన్లు ఆ మహానుభావులు మనకోసం సాధించి పెట్టారు కానీ ఫలితాన్ని పొందడంలో విఫలమవుతున్నాము మన మధ్య ఐక్యత లేకపోవడానికి కారణం అగ్రవర్ణ రాజకీయ పార్టీల కుట్రలే తప్ప మరి ఏది కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకొని భారత రాజ్యాంగం పట్ల అంకిత భావం కలిగి కుల మతాల కుంపటిని కూల్చివేసి మనము మనుషులమనే భావంతో సమ సమాజ స్థాపన కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు జనం మనది బలం మనది ఏకమైతే రాజ్యం మనది అన్న అంబేద్కర్ సూక్తిని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తిప్పే రుద్ర ఆటో రాముడు టీ రాముడు టంగార్డోని హుస్సేన్ అప్ప చెవిటి హుస్సేన్ అప్ప చెవిటి బుడ్డి రప్ప బోరింగ్ నర్సప్ప రాజు అనువాలు పెద్ద ఉల్లిగప్ప ఎం బాబు బిజెపి కాలప్ప ఆంజనేయ కే నాగప్ప మరియు ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.