PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెడికల్​ కళాశాలకు.. రీ ఎంట్రీ…

1 min read

–మెడికల్​ కళాశాల కార్డియాలజి ప్రొఫెసర్​గా డా. చంద్రశేఖర్​

– ఆనందం వ్యక్తం చేసిన కళాశాల సిబ్బంది

కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సూపరింటెండెంట్​గా, మెడికల్​ కళాశాల ప్రిన్సిపల్​గా విధులు నిర్వర్తించి.. ఎందరో మన్ననలు పొందిన రిటైర్డు కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​ … మెడికల్​ కళాశాలలో కార్డియాలజి ప్రొఫెసర్​గా ఉద్యోగంలో చేరారు. శనివారం అధికారికంగా ఆయన ఉద్యోగంలో చేరడంతో రిటైర్డు ప్రిన్సిపల్​ , ప్రముఖ నెఫ్రాలజీ వైద్యురాలు డా. జిక్కి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఎందరో పేదలకు పున: జన్మ ప్రసాదించిన డాక్టర్​గా గుర్తింపు పొందిన డా. చంద్రశేఖర్​… మళ్లీ కళాశాల ప్రొఫెసర్​గా విధుల్లో చేరడంతో మెడికల్​ కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.  రిటైర్డు అయిన తరువాత కూడా తాను మెడికల్​ కళాశాల విద్యార్థులకు… రోగులకు వైద్య సేవ చేసేందుకు సంసిద్ధంగా ఉంటానని ఈ సంద్భంగా కార్డియాలజి ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ స్పష్టం చేశారు.

About Author