జీజీహెచ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి నూతన ప్రొఫెసర్ గా డా.జి.మోహన్ రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అడిషనల్ DME & సూపరింటెండెంట్, డా.వి.వెంకటరంగా రెడ్డి, మాట్లాడుతూకర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి నూతన ప్రొఫెసర్ గా డా.జి.మోహన్ రెడ్డి నియమించినట్లు తెలిపారు అనంతరం వారికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆసుపత్రి గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి ఇప్పటివరకు 6 మంది ప్రొఫెసర్లు నియమించబడ్డారని తెలియజేశారు.అందులో1. డా.బజరంగ ప్రతాప్, 2.డా.కన్నా వెంకటేశ్వర్లు, 3. డా.ఆశా సుబ్బలక్ష్మి, 4. డా.శంకర్ శర్మ, 5.డా.వి.వెంకట రంగారెడ్డి, 6.డా.జి.మోహన్ రెడ్డి 6 మంది ప్రొఫెసర్ ఇప్పటివరకు సేవలు అందించినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి అత్యాధునిక వైద్య పరికరాలతో సేవలందించినట్లు తెలియజేశారు. ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి మెడికల్ విభాగపు వైద్యులు డా.విద్యాసాగర్, గ్యాస్ట్రో ఎంటరాలజీ ప్రొఫెసర్ డా.జి.మోహన్ రెడ్డి, గ్యాస్ట్రో ఎంటరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.దీపక్, డా.ఆర్షియా, డా.సందీప్ కుమార్ రెడ్డి, మరియు పీజీలు తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ DME & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, తెలిపారు.