PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీజనల్ వ్యాధులపై వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ మాధవి

1 min read

ఉచితంగా మందులు పంపిణీ

రామసింగవరంలో 104 ద్వారా మెరుగైన వైద్య సేవలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి :  ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలలో 104 ద్వారా వైద్య సిబ్బంది  ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు, పెదవేగి మండలం రామసింగవరం పంచాయతీ దుర్గమ్మ కాలనిలో 104 ద్వారా పెదవేగి వైద్యాధికారి మాధవి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు, దుర్గమ్మ కాలనీ ప్రజలకుడాక్టర్ మాధవి బి పి .షుగర్,టెస్ట్ సీజనల్ వ్యాధు పై ప్రత్యేక పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు, జ్వరం ,ఎనీమియా,జలుబు,దగ్గు,వంటి సాధారణ  సీజనల్ వ్యాధులకు కూడా డాక్టర్ మాధవి పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమం లో రామసింగవరం సచివాలయ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author