అక్టోబరు 29వ తేది డ్రాఫ్ట్ ఎలెక్ట్రోల్ రోల్ ను తయారు చేసుకోవాలి
1 min readబిఎల్వోలు హౌస్ టు హౌస్ సర్వే తప్పక నిర్వహించాలి.:-
ఆదోని సబ్ కలెక్టర్ (ఇంచార్జ్) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (హెచ్.ఎన్.ఎస్.ఎస్) విశ్వనాథ్ గారు.:-
పల్లెవెలుగు వెబ్ ఆదోని: స్పెషల్ సమ్మరీ రివిజన్ కు సంబంధించి అక్టోబరు 29వ తేది నాటికి డ్రాఫ్ట్ ఎలెక్ట్రోల్ రోల్ ను తయారు చేసుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ (ఇంచార్జ్) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (హెచ్.ఎన్.ఎస్.ఎస్) విశ్వనాథ్ గారు పేర్కొన్నారు. సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో బిఎల్ఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆదోని సబ్ కలెక్టర్ (ఇంచార్జ్) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (హెచ్.ఎన్.ఎస్.ఎస్) మాట్లాడుతూ.. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా రూపొందించడానికి ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు బిఎల్ఓలు ఇంటింటా ఓటర్ల సర్వే ప్రక్రియ చేయడం జరుగుతుందన్నారు. అక్టోబర్ 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం నిర్వహించి, అక్టోబర్ 29వ తేదీన సంక్షిప్త ముసాయిదా ఓటర్ల జాబితా రూపొందించడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. డిసెంబర్ 24వ తేదీలోగా అభ్యంతరాలపై వచ్చిన దరఖాస్తుల పరిశీలించి పరిష్కారం చేయాలన్నారు. 2025 జనవరి 6వ తేది నాటికి సంక్షిప్త సవరణ ఓటర్ల తుది జాబితా ప్రచురించాలన్నారు. ఎన్నికల కమీషన్ సూచించిన మార్గదర్శకాలు తూచ తప్పకుండా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డిప్యూటీ తాసిల్దార్ రామేశ్వర్ రెడ్డి, ఉప తాసిల్దార్ రుద్ర గౌడ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.