కమ్ముకుంటున్న కరువు మేఘాలు.. చినుకు రాలదు.. సాగు సాగదు..
1 min readఅన్నదాతల ఆందోళన..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: వర్షాకాలం మొదలై నెల కావస్తున్న చినుకు రాలక వేసిన పంట మొలక దశలోని వాడి పోయే పరిస్థితి వచ్చింది దాదాపు మండలంలో 25 వేల ఎకరాలు సాగు చేస్తారు ముందస్తు వానలు పలకరించడంతో దాదాపు 5 ఎకరాల్లో మొక్కజొన్న సోయాబీన్ పంటలు వేశారు గత 20 రోజుల నుండి మేఘాలు కమ్ముకుంటున్న చినుకు రాలక రైతన్నలు ఆకాశం వైపు చూస్తున్నారు ఖరీఫ్ మొదలైన వాతావరణ శాఖ అంచనాలు తప్పడం ఈసారి వర్షాలు సమృద్ధిగా పడతాయని అంచనా వేయడంలో వాతావరణ శాఖ విఫలమైందని చెప్పాలి 20 రోజులకు గాను మిల్లీమీటర్లు వర్షం కురవడం మండలంలో వేసిన పంటను రైతులు దున్నేస్తున్నారు ఈనెల 15 లోపు వర్షాలు పడితే వేసిన పంటకు ఊపిరి వస్తుందని మొత్తానికి పంటవేసిన రైతులు వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి వేసిన పంటను అంచనా వేసి నష్టపరిహారం గుర్తించాలని అధికారులను ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు అన్ని మండలాల కంటే లోటువర్షం తో కరువు మండలంగా మారుతుందేమో చూడాలి.