ఎండా కాలం..ఉపాధి కూలీలు జాగ్రత్త
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ప్రస్తుతం ఎండలు విపరీతంగా ఉన్నాయని ఉపాధి పనులకు వెళ్లినప్పుడు కూలీలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా అంబుడ్స్ పర్సన్ డాక్టర్ ఆర్ సురేంద్ర కుమార్ ఉపాధి కూలీలతో అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను గురువారం ఉదయం ఆయన తనిఖీ చేశారు.ఉదయం 5:30 నుంచి 10:30 వరకు పనులు చేయాలని పనులు ప్రదేశంలో ఉపాధి కూలీలు మధ్య మధ్యలో నీడకు కూర్చోవాలని త్రాగు నీటిని బాగా తీసుకోవాలని ఆయన అన్నారు.44 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండలు ఎక్కువగా ఉన్నాయని వడదెబ్బకు గురికాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కొలతల ప్రకారం పనులు చేస్తే మీకు తగినంత కూలీ వస్తుందని పనులు జరిగే ప్రదేశానికి మెడికల్ కిట్లు మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.మీ పిల్లలను మంచిగా చదివించే విధంగా వారిని ప్రోత్సహించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్.గంగావతి,ఏపీఓ భూపన జయంతి,ఫీల్డ్ అసిస్టెంట్ మధు మరియు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.