పారా షూటింగ్ పసిడి పతక విజేతను అభినందించిన డిఎస్డిఓ భూపతి రావు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: గత నెల 29న విశాఖలో జరిగిన మూడవ రాష్ట్రస్థాయి పారా షూటింగ్ ఛాంపియన్షిప్లో కర్నూలు క్రీడాకారుడు ముస్తాక్ అహ్మద్ పసిడి పతకాన్ని సాధించాడు. పది మీటర్ల పిస్టల్ విభాగంలో ఆయన 360 పాయింట్లు సాధించి పసిడి పతకాన్ని చేజిక్కించుకున్నాడు. బుధవారం ఉదయము;జిల్లా క్రీడా సంస్థ అధికారి భూపతిరావు ఆయన కార్యాలయం లో ముస్తాక్ అహ్మద్ ను శాలువా కప్పి అభినందించాడు. జాతీయస్థాయిలోనూ రాణించి పథకాలు సాధించాలని కోరారు. కోచ్ రవికుమార్ అడ్వకేట్ మాట్లాడుతూ వెంకటరమణ కాలనీలో ఉన్న RK అకాడమీలో శిక్షణ పొందిన క్రీడాకారుడు పారాషూటింగ్లో ముస్తాక్ అహ్మద్ తన ఎడమ చేతి వాటాన్ని ప్రదర్శించి పట్టుదలతో పసిడి పథకాన్ని సాధించడం జిల్లాకే గర్వకారణం అని కొనియాడారు. ఈ సందర్భంగా కర్నూల్ జిల్లా రైఫైల్ షూటింగ్ సంఘం కార్యదర్శి ఎం డి భాష మాట్లాడుతూ.. ముస్తాక్ అహ్మద్ కు మంచి భవిష్యత్తు ఉందని.. ఒంటి చేత్తో పసిడి పథకాన్ని సాధించే సత్తా ఉన్న ముస్తాకును దాతలు సహకరించి జాతీయస్థాయి పోటీలకు వెళ్లేందుకు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో బాస్కెట్బాల్ సీనియర్ క్రీడాకారులు దాదాభాష, వ్యాయామ ఉపాధ్యాయుడు ముస్తాహిర్ పాల్గొన్నారు.