రోడ్డుకు అడ్డంగా గుంతలు తవ్విన ఓ రైస్ మిల్లు కు చెందిన పారిశ్రామికవేత
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఫిర్యాదు మేరకుహోళగుంద మండలం మేజర్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేస్తే ఆయన స్పందించి వెంటనే పివిసి పైపు ఏర్పాటు చేసి తాత్కాలిక మరమ్మతులు ఒక 01గ!! లోపల మరమ్మతులు చేయిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ కు తెలియజేశారు.పని పూర్తి కాకపోవడంతో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ అనంతరం వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే రైస్ మిల్ యజమానంతో ఫోన్ చేసి మాట్లాడాను ఆ పైపు రోడ్డుకు సరిపోవడం లేదు కర్ణాటక రాష్ట్రం సిరుగుప్పలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది రేపటి లోపల సిమెంటు పైపు తీసుకొచ్చి పైపు వేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్రావెల్ వేయించి మరమ్మతులు చేయిస్తానని మండల గ్రామ పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ కు తెలియజేస్తే ఆ విషయాన్ని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ కు మేజర్ గ్రామపంచాయతీ రాజశేఖర్ తెలియజేయడం జరిగింది.ఇది R&B రోడ్డుకు సంబంధించిన విషయం కానీ మండల ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని విషయం తెలియజేస్తూ నా వంతు సహకారం చేస్తా అంటూ మండల గ్రామ పంచాయతీ సెక్రెటరీ విషయం తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ మాట్లాడుతూ ఈ రోడ్డు మార్గాన నిత్యం అధిక సంఖ్యలో బళ్లారి సిరుగుప్ప ఆదోని ఎల్లార్తి కు ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు ఆటోలు ద్విచక్ర వాహనాలు అనునిత్యం తిరుగుతూ ఉంటాయి.ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు.కాబట్టి రోడ్డు రవాణా అధికారులు (మరియు) మండల అభివృద్ధి అధికారులు వెంటనే స్పందించి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టవలసిందిగా అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజ్ ఏర్పాటు చేయవలసిందిగా ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఫిర్యాదు చేసిన వెంటనే మరమ్మతులు చేయించిన గ్రామ పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్కి ఏఐఎస్ఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి, శ్రీరంగ, గాది, తదితరులు పాల్గొన్నారు.