PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విధులకు డుమ్మా..డీఎంహెచ్ ఓ కు ఎమ్మెల్యే ఫోన్

1 min read

మూడు నెలలుగా వైద్యుల డుమ్మా ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మా కార్యాలయాలకు మేమే రాజులం మేము ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా మమ్మల్ని అడిగే వారెవ్వరూ అన్న చందంగా ఉన్నారు కొందరు అధికారులు.. సాక్షాత్తు ఎమ్మెల్యే అధికారులకు చెప్పకుండానే ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే..ఆ తనిఖీల్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే గురువారం ఉదయం 10 గం.10:40  నిమిషాల వరకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య బ్రాహ్మణకొట్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు.ఆసుపత్రికి సిబ్బంది మరియు డాక్టర్లు 9 గంటలకే విధుల్లో చేరాలి.కానీ అక్కడ ఉన్న ఇద్దరు వైద్యులు డాక్టర్ మనోజ్,డాక్టర్ సరిత అక్కడ వీధుల్లో లేరు.అంతే కాకుండా వీరిలో ఒక డాక్టర్ గత మూడు నెలల నుంచి విధులకు రావడం లేదని కానీ సెలవుల్లో ఉన్నట్లు కూడా లెటర్ లేదు సిబ్బంది హాజరు పట్టికను ఎమ్మెల్యే తనిఖీ చేసి స్వయంగా ఎమ్మెల్యే నంద్యాల డీఎంహెచ్ఓ కు ఫోన్ చేసి నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రిలోనే ఆయుర్వేద గదిని  పరిశీలించారు అక్కడ ముగ్గురిలో ఒకరు డిప్యూటేషన్ పై వెళ్ళారని ఎమ్మెల్యేకు సిబ్బంది తెలుపగా డిప్యూటేషన్ పై వెళ్లడానికి వీలు లేదని ఇక్కడే ఉండాలని ఎమ్మెల్యే అన్నారు.తర్వాత పశువుల ఆసుపత్రిని తనిఖీ చేయగా ఆస్పత్రి తెరిచే ఉంచారు కానీ అక్కడ సిబ్బంది ఎవరూలేరు కాంపౌండర్ మాత్రమే ఇక్కడ ఉన్నారు డాక్టర్లు రాకపోవడం పట్ల ఎమ్మెల్యే జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా అధికారికి ఫోన్ చేసి విధుల్లో  నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.దాదాపు 11 గంటలైనా కూడా కార్యాలయాలకు వైద్యులు సిబ్బంది విధులకు రాకపోతే ఎలా అంటూ ఓ సమావేశంలో ఎమ్మెల్యే మండిపడ్డారు.

About Author