వీహెచ్పి మాతృ శక్తి దుర్గావాహిని దుర్గాష్టమి ఆయుధ పూజ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈ కార్యక్రమాన్ని ఈపూరి లక్ష్మి జిల్లా దుర్గా వాహిని కన్వీనర్ నిర్వహించారు, ముఖ్యఅతిథిగా వేదవతి మాట్లాడుతూ మహిళలు సామూహిక పూజ కార్యక్రమాల్లో పాల్గొని సంఘటితం అవ్వాలని తెలిపారు, ఈనాటి ముఖ్య వక్త జంపాల రాధిక మాతృ శక్తి జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ ఈనాడు దుర్గా వాహిని ఆవిర్భావ దివస్ 1991లో విశ్వ హిందూ పరిషత్ యువతి విభాగం దుర్గవాహిని అయోధ్యలో ప్రారంభించారు యువతిలో హిందూ ధర్మీక నిష్ట పెంచుతూ,సంస్కృతి, సాంప్రదాయాలును, శారీరక, మానసిక ధైర్యాన్ని, దేశభక్తిని-ధర్మ పరిరక్షణ పట్ల బాధ్యత యువతలను తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా దుర్గావాహిని ఆనాడు ప్రారంభించారు అందులో భాగంగా కర్నూలు జిల్లాలో పలుచోట్ల దుర్గాష్టమి ఆయుధ పూజ పేరుతో మహిళలను చైతన్యం చేసేందుకు దుర్గావాహిని దుర్గాష్టమ ఆయుధ పూజా కార్యక్రమాలు చేయడం జరిగినది అని తెలిపారు.కార్యక్రమంలో జయశ్రీ, శివమ్మ, ఇంద్ర, లావణ్య, శ్రీలక్ష్మి, విజయలక్ష్మి, మహేశ్వరి, జయలక్ష్మి, నాగేశ్వరి నాయుడు, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. సంఖ్య 27స్త్రీలు 22పురుషులు 5.