సెమీ క్రిస్మస్ వేడుకల్లో.. నందికొట్కూర్ ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న ఏబీఎం చర్చిలో రాత్రి జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరయ్యారు. క్యాండిల్ లైట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ సునీల్ అమృత రాజ్ క్రిస్మస్ పండుగ ఏసుక్రీస్తు జన్మదినం గురించి వాక్య పరిచర్య చేశారు.క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.కేక్ కట్ చేసి ఒకరినొకరు సంతోషంగా పంచుకున్నారు. ఎమ్మెల్యేను మరియు టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, పగిడ్యాల మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సంఘ కాపరి కే.ఇమ్మానియేల్ మరియు సంఘ పెద్దలు యువకులు మహిళలు పాల్గొన్నారు.