PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దూసుకురానున్న నవీన్‌

1 min read

సినిమా డెస్క్​: నవీన్‌ పొలిశెట్టి ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ తో హీరోగా ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకున్నాడు. ఈయేడు ‘జాతిరత్నాలు’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. రెండు సినిమాలతోనే క్రేజీ హీరోగా పేరుతెచ్చుకోవడంతో ఆ డైరెక్ట్‌ర్‌‌తో చేస్తున్నాడు. ఈ సినిమాలో చేస్తున్నాడు అంటూ ఎన్నో రూమర్లు వస్తున్నాయి. వీటన్నిటికీ నవీన్‌ చెక్‌ పెడుతూ నవీన్ ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం మూడు సినిమాల స్క్రిప్ట్ పనుల్లో ఉన్నానంటూ కన్ఫామ్‌ చేశాడు. వీటి గురించి త్వరలో తానే అనౌన్స్ చేస్తానని కూడా చెప్పాడు. అప్పటి వరకూ ‘ఇంకెక్కడ ఏం చదివినా నమ్మకండి’అంటూ ఫన్నీగా పోస్టు పెట్టాడు. బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో తన సినిమాలు వస్తున్నాయంటూ.. అది తన డ్రీమ్ అని, ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నా అంటూ ట్వీట్ చేశాడు. ఈ మూడింటిలో తెలుగులో రెండు, హిందీలో ఒక మూవీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ‘జాతి రత్నాలు’ సీక్వెల్ తో పాటు యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ దర్శకుడని, అనుష్కతో కలిసి నటించనున్నాడనే టాక్ బాగా వినిపిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీలో విజయ్ దేవరకొండ కూడా ఓ కీ రోల్ లో కనిపించనున్నాడనే న్యూస్ వైరల్ అవుతుంది. వీటిలో నిజనిజాలు తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగక తప్పదు.

About Author