ద్వారకాతిరుమల మండలంలో ఇల్లు లేని నిరుపేదలకు స్థలాలు ఇవ్వాలి
1 min readస్థానిక ఎమ్మార్వో కార్యాలయం సిపిఐ నాయకులు వద్ద ధర్నా, వినతి పత్రం అందజేత మేనేజర్
50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ద్వారకాతిరుమల ద్వారకా తిరుమల మండలంలోని తిమ్మాపురం, కోడిగుడెం, రామసింగవరం గ్రామాలలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు మూడో సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు తక్షణ మంజూరు చేయాలని కోరుతూ కోరుతూ ద్వారకాతిరుమల తాహాసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నాడు ధర్నా చేసి మండల డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ద్వారకాతిరుమల మండల కార్యదర్శి గోలిమే బాలయేసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు గ్రామాల్లో ఇంటి స్థలం లేని పేదలకు మూడు సెంట్లు ఇంటి స్థలం, వికలాంగులకు పెన్షన్లు, మరియు డప్పు కళాకారుల కు 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల మండల కార్యదర్శి గొలమే బాల యేసు , సిపిఐ గ్రామ కార్యదర్శి యడ్లపల్లి రమేష్, పెండ్లి భూషణం, కొప్పుల రామకృష్ణ, పాకనాటి సుబ్బారావు, ఉండి మార్తమ్మ ,పాకనాటి వెంకటేశ్వరరావు, నల్లటి దేవ మాత, జాలాది సత్యవతి, యడ్లపల్లి లక్ష్మి, బయ్యారపు ఆనందరావు, నల్లటి పెద్దిరాజు, ఏపూరి పోతురాజు, జాలాది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.