ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ముందస్తు అడ్మిషన్లు, అక్రమ ఫీజులను అరికట్టాలి
1 min readప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతున్న విద్యాశాఖ అధికారులు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ పట్టణం నందు ప్రైవేట్, కార్పొరేట్ చైతన్య, ఏ వి ఆర్, ప్రతిభ, శాంతి టాలెంట్, ఆర్.ఆర్, ఎస్టీ జోసెఫ్ విద్యాసంస్థలు పోటీపడి మరి ముందస్తు అడ్మిషన్లు అక్రమ ఫీజులను వసూలు చేస్తూ విద్యార్థులు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు అల్తాఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు నజీర్ ఆరోపించారు. ఈ మేరకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ముందస్తు అడ్మిషన్లు అక్రమ ఫీజులను అరికట్టాలని శనివారం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం నందు ఏవో నాగభూషణం కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం పూర్తి కాకముందే ప్రభుత్వాన్ని నిబంధనలను తుంగలో తొక్కి యదేచ్చగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని అన్నారు. పెద్ద పెద్ద హోర్డింగులు మరియు రంగురంగుల కరపత్రాలతో విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల యొక్క తల్లితండ్రులను ఎరవేసి మోసం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. వీరి మాయమాటలను టీవీలలో పత్రిక ప్రకటనలో అడ్వర్టైజ్మెంట్లుగా చూసి విద్యార్థులకు తల్లిదండ్రులు కూడా మోసపోతున్నారని, వీటన్నింటినీ అరికట్టాల్సిన జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల అడుగులకు మడుగులు వత్తుతూ, వారిచ్చే మామూళ్ల మత్తులో మునిగి తేలుతూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.