PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి శుక్రవారం “ఫ్రైడే డ్రై డే” పై వీడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించండి

1 min read

రోగాలు ప్రబ‌ల‌కుండా ఎప్పటిక‌ప్పుడు చ‌ర్యలు తీసుకోవాలి

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టి.జి. భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రతి శుక్రవారం “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమం పై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టి.జి.భరత్ వైద్య సిబ్బందిని అదేశించారు.శనివారం స్థానిక రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రివర్యులు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ముందుగా దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ వెక్టార్ బార్న్ డిసీజెస్, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ (టిబి, లెప్రసీ) ఇమ్యునైజేషన్, అనీమియా, తల్లి బిడ్డ మరణాల రేటు, బిల్డింగ్ స్టేటస్, సిబ్బంది శాతం, ఎన్సిడి ప్రోగ్రామ్స్ పై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. అదే విధంగా కార్డియాల‌జీ, నెఫ్రాల‌జీ, న్యూరోస‌ర్జ‌రీ, డ‌యాగ్నోస్టిక్ బ్లాక్స్, ఎం.ఆర్.ఐ, సిటీ స్కాన్, ఆల్ట్రాసౌండ్ మిష‌న్ల‌పై మంత్రి ఆరా తీశారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ వంద శాతం ఆసుపత్రి డెలివరీస్ జరిగేలా చర్యలు తప్పనిసరి చర్యలు తీసుకోవాలని మంత్రి వైద్య సిబ్బంది ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల చాలా వరకు రోగాల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు. దీనికి సంబంధించి ప్రతి శుక్రవారం “ఫ్రైడే డ్రైడే” అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని డిఎంహెచ్ఓ మంత్రి దృష్టికి తీసుకొని రాగా ఇంకా పెద్ద ఎత్తున ప్రజల ఈ కార్యక్రమం పట్ల అవగాహన కలిగేలా డిఎంహెచ్ఓ కర్నూలు అనే సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకొని ఫ్రైడే డ్రైడే కార్యక్రమంపై 30 సెకన్లు/1 నిమిషం నిడివి ఉన్న వీడియో తయారు చేసి వాటి ద్వారా ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌పై ప్ర‌జ‌ల్లో చైత‌న్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ ను మంత్రి అదేశించారు. అదే విధంగా గర్భిణీ స్త్రీలు బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిఎంవివివై అందజేసే ఆర్థిక చేయూత లాంటి కార్యక్రమాలను కూడా ఎఎన్ఎం, ఆశ వర్కర్ల ద్వారా అందరికీ తెలిసేలా చర్యలు మంత్రి పేర్కొన్నారు. నగరంలో దోమల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో చికిత్స కోసం ప్రజలు వస్తుంటారని వారికి మెరుగైన వైద్య సేవలు అందజేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ మంత్రి ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే వాహనాల ఎక్కడపడితే అక్కడ ఆపకుండా ఒక క్రమ పద్ధతిలో వాటిని ఉంచుకునేలా చూడాలన్నారు. అత్య‌వ‌స‌ర వైద్య‌సేవ‌లు అందించ‌డంలో అల‌స‌త్వం వ‌హించ‌కూడ‌ద‌న్నారు. గ‌ర్బిణీలతో పాటు హెచ్.ఐ.వి, టి.బి రోగుల‌కు అందుతున్న వైద్య‌సేవ‌ల‌పై ఆరా తీశారు.డెంగ్యూ, మ‌లేరియా, చికెన్ గున్యాపై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మలేరియా అధికారిని మంత్రి ఆదేశించారు.అనంతరం ఆసుపత్రిలో ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ మంత్రికి వివరించారు.సమావేశంలో డిఎంహెచ్ఓ భాస్కర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, డిసిహెచ్ఎస్ మాధవి, మలేరియా అధికారి నూకరాజు, ఆరోగ్య శ్రీ కోఆర్డినేట్ భాస్కర్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *