జీవితాన్ని మార్చేది చదువు ఒకటే..
1 min readడొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు
తల్లిదండ్రులు గర్వపడేలా విద్యార్థులు చదవాలి
వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలను నాశనం చేసింది
ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలో జీవితాన్ని మార్చేది కేవలం చదువు ఒకటే అని, ఏకాగ్రత, పట్టుదల, కసితో విద్యార్థులు చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, విద్యారంగానికి కూటమి ప్రభుత్వం పెను మార్పులు తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని జూనియర్ బాలురు కళాశాల, మహిళల జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గార్లు విద్యా రంగంలో పెను మార్పులు తీసుకొస్తున్నారని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతుండగా గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ కళాశాలలో అమలు చేశారు, వైసిపి అధికారంలోకి రావడంతో ఇంటర్ కళాశాలలో నిలిపివేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్య శాఖ మంత్రి నారా లోకేష్ అదశలతో జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు అవుతున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా, ఆరోగ్యకరంగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి పనికి రాష్ట్ర ప్రజలంతా హర్షిస్తున్నారని దాన్ని వైసిపి విషపూరితమైన ఆలోచనలతో చెడగొట్టాలని ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందని, అతి త్వరలో తల్లికి వందనం, ఉచిత బస్ ప్రయాణం పథకాలు అమలు అవుతాయని తెలిపారు. ఇటువంటి మంచి పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు టిడిపి నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.