విద్యారంగ సమస్యలు సత్వరమే పరిష్కరించాలి – యుటిఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ : విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని,ప్రాథమిక విద్యా వ్యవస్థని తూట్లు పొడిచే జీఓ నంబర్ 117 రద్దు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు వెంకట సుబ్బారెడ్డి,యుటిఎఫ్ జిల్లా సీనియర్ నాయకులు మాణిక్యం శెట్టి,పూర్వ జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య,జిల్లా నాయకులు అబ్దుల్ లతీఫ్,జిల్లా సహాధ్యక్షులు శాంతి ప్రియ,జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి 50 సంవత్సరాలు అయినందున స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా యుటిఎఫ్ ప్యాపిలి మండల శాఖ ఆధ్వర్యంలో ప్యాపిలి బస్టాండ్ దగ్గర యుటిఎఫ్ శాశ్వత పతాక దిమ్మె ఏర్పాటు చేసి యుటిఎఫ్ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని యుటిఎఫ్ సీనియర్ నాయకులు రంగయ్య నాయుడు గావించారు.అనంతరం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మండల సీనియర్ నాయకులు బొజ్జన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్యాపిలి మండల శాఖలో గతంలో ప్రధాన బాధ్యులుగా పని చేసి మరణించిన యుటిఎఫ్ నాయకులు రంగస్వామి, సత్యానందం,వెంకటయ్య,కృష్ణమాచార్యులు గార్లకు మండల శాఖ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం యుటిఎఫ్ 50 సంవత్సరాల వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు.ఈ సమావేశంలో మండల నాయకులు శేషయ్య,ఆంజనేయ ప్రసాద్,రాజేంద్ర,మధు,అంజనప్ప,చంద్ర మోహన్,సర్వజ్ఞ మూర్తి, షేక్షావలి, నాగమణి,లక్ష్మి,భోగేశ్వరమ్మ,మహబూబ్ బాషా,రాజన్న,నాగరాజు,శివ కేశవులు,శివ ప్రసాద్,నరసింహయ్య, హరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.