PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యా రంగ సమస్యలు పరిష్కారించాలి : ఏఐఎస్​ఏ -పిడిఎస్​యూ 

1 min read

జీఓ నెంబర్ 77,117 లను రద్దు చేయాలని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు జునేద్ బాషా AISA జిల్లా కార్యదర్శి నాగార్జున డిమాండ్: 

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు:  రాష్ట్రవ్యాప్త విద్యారంగా సమస్యల పరిష్కరించాలని ఏఐఎస్ఏ, పిడిఎస్యు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని గౌడ్ సెంటర్ వద్ద కేజీ రోడ్డు పై ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జునేద్ బాషా ఏ ఐ ఎస్ ఏ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ…. నీట్ పరిక్ష ఫలితాలలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు జడ్జి తో విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని జీవో నెంబర్ 77 ను తీసుకువచ్చి పీజీ చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ రాకుండా చేసి పీజీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేశారని జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ చదువుతున్న విద్యార్థులు అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ కొనసాగించాలని, ప్రభుత్వ విద్యను నాశనం చేసే విధంగా ప్రభుత్వ పాఠశాల 3,4,5 తరగతుల  విలీనానికి జీవో నంబర్ 117 తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను పూసివేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులకు మరియు గుడారాల తండాలలో నివసిస్తున్నటువంటి గిరిజనులకు ప్రభుత్వ విద్యను దూరం చేసే విధంగా విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులు అనేక సమస్యలు సృష్టించారని గుర్తు చేశారు కావున 117 జీవోను రద్దు చేసి మూతబడిన పాఠశాలను తిరిగి ప్రారంభించాలని. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారని మధ్యాహ్న భోజనం పథకం రద్దుచేసి విద్యార్థుల కడుపులు మార్చారని ఆవేదన వ్యక్తంచేశారు. కావున సకాలంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యానం భోజనం తిరిగి ప్రారంభించాలని కోరారు.. డిగ్రీ,పీజీ,ఇంజనీరింగ్ విద్యార్థుకు ఫీజ్ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించి ధరలకు అనుగుణంగా మెస్,కాస్మొటిక్ చార్జీలను పెంచి పెండింగ్ లో ఉన్న మెస్,కాస్మొటిక్  చార్జీలను విడుదల చేయాలని ఖాళీగా ఉన్న  వార్డెన్,వర్కర్ పోస్టులను భర్తీ చేయాలని అదేవిధంగా విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్స్,అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  శ్రీశైలం నియోజకవర్గం అధ్యక్షుడు వర్ధన్ మండల  నాయకులు హేమంత్,మహీంద్రా,చిన్న పిడియస్యూ నాయకులు రామాంజనేయులు,ఇర్ఫాన్,సాయి తదితరులు పాల్గొన్నారు.

About Author