సెలవు రోజుల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ను విద్యాసంస్థల్లో నిర్బంధించడం తగదు
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు సెలవులు ఇచ్చి సిబ్బందిని మాత్రం హాజరుకావాలని ఆదేశిస్తున్నారు. బంద్ రోజున రవాణా సౌకర్యాలు ఉండని పరిస్థితులలో సిబ్బంది విద్యాసంస్థలకు రావడం కష్టమవుతుంది అదేవిధంగా పిల్లలకు సెలవులు ఉండడం చేత ఇంటిదగ్గర పిల్లలను చూసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. పట్టణంలోని శ్రీ చైతన్య నారాయణ,భాష్యం,లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో టీచర్లను సెలవు హక్కు నిమిత్తం ఇళ్లకు పంపించడం జరిగింది జరిగింది.విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నప్పుడు సెలవు విద్యార్థికి మరియు సిబ్బందికి ఇద్దరికీ వర్తిస్తుంది. విద్యార్థులకు మాత్రమే సెలవులు ప్రకటించి సిబ్బందితో పని చేయించుకోవడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధము కావున సెలవు రోజుల్లో పని చేయించుకుంటున్న విద్యా సంస్థలపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎర్రన్న,సిద్ధరాముడు,అఫ్జల్,రాఘవేంద్ర పాల్గొన్నారు.