మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందించేందుకు కృషి
1 min readకర్ణాటక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వేద విద్యార్థుల కుభౌతిక కాయలకు పూలమాలవేసి నివాళులర్పించిన మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి
ఈ ఘటన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, టిజి భరత్ రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : కర్ణాటకలో సింధునూరు సమీపంలో పోతునాల గ్రామ దగ్గర నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు వేద విద్యార్థులు డ్రైవర్ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో కర్ణాటక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుంజహల్లి కృష్ణ కుమారుడు వేద పాఠశాల విద్యార్థి సుజయీంద్ర, డ్రైవర్ శివ భౌతిక కాయాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, టిజి భరత్, రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంఘీభావం ప్రకటించారని తెలిపారు. కొండంత ధైర్యం చెబుతూ అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అశోక్ రెడ్డి, వరదరాజులు,రఘు, డిసిసి తిమ్మప్ప, శివ,డేవిడ్, మేకల నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.