చలి తీవ్రత నేపథ్యంలో వృద్ధులు చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలి
1 min readచలినుంచి రక్షణ కోసం పేద వృద్ధులకు స్వెటర్లు మంకీ క్యాప్ లు పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు చలి ప్రభావానికి గురికాకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న శ్రీ గురుదత్త పాలి క్లినిక్ లో చలి తీవ్రత నుంచి రక్షణ కోసం పేద వృద్ధులకు ఆయన స్వెటర్లు, మంకీ క్యాప్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా వృద్ధులకు స్వెటర్లు ,మంకీ క్యాప్ లను పంపిణీ చేసినట్లు వివరించారు. గతంలో చలి తీవ్రత నుంచి రక్షణ కోసం దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందని త్వరలోనే వాటిని కూడా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ముఖ్యంగా చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు చిన్నపిల్లలు ఉదయం 10:30 గంటల తర్వాత బయటికి రావాలని ,అత్యవసరమైతే చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లు, మంకీ క్యాపులు ధరించాలని ఆయన సూచించారు .చలికాలంలో తెల్లవారుజామున గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు .చలి తీవ్రత నేపథ్యంలో చలి ప్రభావానికి గురయితే కొంతమందిలో రక్తనాళాలు సంకోచించి రక్త సరఫరా తగ్గిపోయి వేళ్ళు, కాలిభాగాలు నల్లగా మారే అవకాశం ఉందని వివరించారు. కొంతమందిలో గ్యాంగ్రిన్, వెరికోసిస్ వంటి సమస్యలు తలెత్తుతాయని తెలియజేశారు. చలి ప్రభావానికి గురైతే కొంతమందిలో వారి చర్మం పూర్తిగా పొడి బారుతుందని, శరీరంపై గీరుకోవడం వల్ల శరీరంపై పుండ్లు ఏర్పడే అవకాశం ఉందని ఆయన వివరించారు. చలికాలంలో మధుమేహ వ్యాధితో బాధపడే వారికి వివిధ రకాల సమస్యలు తగిలితే అవకాశం ఉందని వివరించారు. చలి తీవ్రత నేపథ్యంలో తాను తరచూ చేసే సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం వృద్ధులకు స్వెటర్లు, మంకీ క్యాప్ లు పంపిణీ చేశానని ,సమాజంలో ఆర్థికంగా ఉన్నవారు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడించారు.