(AIPTF ) జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆప్టా గణపతి రావు ఎన్నిక
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ జి ఎస్ గణపతి రావు ఈరోజు కేరళ రాష్ట్రం కొచ్చి నగరం లో జరిగిన అఖిలభారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య(AIPTF) జాతీయ ఎన్నికల్లో జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నిక అయ్యారని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రకాష్ రావు ఫోన్ ద్వారా కొచ్చిన్ నుంచి పత్రికలకు తెలియజేశారు జాతీయస్థాయిలో 25 రాష్ట్రాల్లో 23 లక్షల మంది ప్రాథమిక ఉపాధ్యాయులు సభ్యులుగా గల ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం ఏఐపిటిఎఫ్ అని ప్రకాష్ రావు తెలియజేశారు కర్ణాటక చెందిన బసవరాజు గురికర్ జాతీయ అధ్యక్షులుగాను ఒరిస్సాకు చెందిన కమలకాంత్ త్రిపాఠి జాతీయ సెక్రెటరీ జనరల్ గాను ఉత్తర ప్రదేశ్ కి చెందిన మనోజ్ కుమార్ జాతీయ ఆర్థిక కార్యదర్శిగా ఎన్నికయ్యారని, ఆంధ్రప్రదేశ్ నుండి ఎ జి ఎస్ గణపతి రావు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికయ్యారని పత్రికలకు తెలియజేశారు జాతీయస్థాయిలో సిపిఎస్ ను పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని జాతీయ కార్యవర్గం తెలియచేసింది నూతన విద్యా విధానం ప్రభుత్వ పాఠశాలను బలహీనపరిచి కార్పొరేట్ పాఠశాలను బలోపేతం చేసే విధంగా ఉందని వారు అన్నారు , ప్రాథమిక ఉపాధ్యాయులకు శాసన మండలి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తెలియజేశారు.