అపుస్మా ఏలూరు, దెందులూరు నియోజకర్గాల నూతన కార్యవర్గం ఎన్నిక
1 min readపాల్గొన్న పళ్ళు పాఠశాలల సిబ్బంది
పల్లెవెలుగు, ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ -ఎయిడెడ్ స్కూల్స్ మానేజ్మెంట్స్ అసోసియేషన్, ఏలూరు మరియు దెందులూరు నియోజకవర్గం నూతన కార్యవర్గం ఎన్నిక స్థానిక లిటిల్ వరల్డ్ పాఠశాలలో జరిగింది.ఏలూరు నియోజకవర్గం గౌరవాధ్యక్షునిగా తొమ్మిది పర్యాయాలు జోన్ ప్రెసిడెంట్ గా వ్యవహరించిన సీనియర్ నాయకులు డా.మార్గాని నాగ శ్రీకాంత్ (S.K స్కూల్ ) అధ్యక్షునిగా కొసరాజు వెంకటేశ్వరరావు (హోప్ స్కూల్ ), సెక్రరరీ గా సతీష్ కుమార్ (బ్రైట్ స్కూల్ )మరియు కోశాధికారి గా శేఖర్ (సన్ షైన్ స్కూల్ ) ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు. దెందులూరు నియోజకవర్గం గౌరవాధ్యక్షునిగా చుక్కా అవినాష్ రాజు ( SMC స్కూల్ ) అధ్యక్షునిగా ఎస్.ఎస్ రాజు (మమత స్కూల్ ), సెక్రరరీ గా తంబీ (శారదాంబికా స్కూల్ )మరియు కోశాధికారి గా జయరాజు (సుష్మా స్కూల్ ) ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర జనరల్ సెక్రటరీ యమ్ బి ఎస్ శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్గాని నాగ శ్రీకాంత్, జిల్లా అధ్యక్షులు గున్నం బులెబ్బాయ్, అన్నపనేని రవికుమార్, జిల్లా సెక్రటరీ శివ కుమార్, జిల్లా కోశాధికారి రవి శంకర్, ఏలూరు నాయకులు గిరిబాబు, లక్ష్మణ్ కుమార్, చంద్రశేఖర్, ప్రసాద్, వినోద్ కుమార్ తదితర నాయకులు పలు పాఠశాలలో సిబ్బంది పాల్గొన్నారు.