PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు

1 min read

పల్లెవెలుగు వెబ్  హొళగుంద:  హొళగుంద మండలంలోని స్థానిక ఈ బీసీ కాలనీలో ఉన్న ఉర్దూ పాఠశాలలో హెచ్ఎం ఆసియా ఆధ్వర్యంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ను ఎన్నుకోవడం జరిగింది.15 మందితో కూడిన కమిటీ సభ్యులు చైర్మన్ గా  ఎం ఇర్ఫాన్ ను వైస్ చైర్మన్ గా సుమియాను , ఎన్నుకున్నారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన ఎం ఇర్ఫాన్ మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మరియు దీనికి కమిటీ సభ్యుల సహాయ సహకారాలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఆసియా మరియు విద్య అధికారి సాయి బేస్ మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author