సాగు నీటి సంఘాల ఎన్నికల్లో సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టండి
1 min readజలవనరుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సాగు నీటి సంఘాల ఎన్నికల్లో ఎటువంటి లోటు పాట్లు లేకుండా పటిష్ఠంగా సజావుగా విధంగా చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు.గురువారం విజయవాడ కార్యాలయం నుండి సాగు నీటి సంఘాల ఎన్నికల నిర్వహణ అంశం పై జిల్లా కలెక్టర్ లతో జలవనరుల శాఖ స్పెషల్ సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ సిఎస్ సాగు నీటి సంఘాల ఎన్నికల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లకు దిశా నిర్దేశం చేశారు. సాగు నీటి సంఘాల ఎన్నికల నిర్వహణ పై డివిజన్ స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించాలని, సజావుగా ఎన్నికలను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని స్పెషల్ సిఎస్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ సాగు నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.. ఇందుకు సంబంధించి డిసెంబర్ 5వ తేదిన నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 8వ తేదిన ప్రాదేశిక నియోజకవర్గం (territorial constituency), వాటర్ యూజర్స్ అసోసియేషన్ కు ఎన్నికలు ఉంటాయని, డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు 11వ తేదీన ఎన్నికలు, ప్రాజెక్ట్స్ కమిటీలకు 14వ తేదీన ఎన్నికలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అధికారుల నియామకం పూర్తి చేశామన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, జలవనరుల శాఖ ఎస్ఈ బాలచంద్రారెడ్డి, డిఈ లు తదితరులు పాల్గొన్నారు.