విద్యుత్ భారం – జగన్ దే ఆ పాపం
1 min readదెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్య
జగన్ అవినీతి వల్లె విద్యుత్ భారం రూ.1,29,000/- కోట్లు
చార్జీలు పెంచి జనాన్ని దోచుకుని,మళ్ళీ నువ్వే ధర్నాలు చేయటం సిగ్గు చేటు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: విద్యుత్ చార్జీల పెంపు పాపం జగనే అని, జగన్ చేసిన అవినీతి వల్లె విద్యుత్ భారం రూ.1,29,000 కోట్ల రూపాయలు అయిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ప్రజలపై కరెంటు చార్జీలను విపరీతంగా పెంచేసి మోయలేని భారాన్ని ప్రజలపై వేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు విద్యుత్ చార్జీలపై ధర్నాలు చేయడం సిగ్గుచేటని, ఇది ప్రజలను మరోసారి మోసం చేయడానికి జగన్ చేస్తున్న ప్రయత్నమే అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు అధికారులు కార్యకర్తలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాలనుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు వివరించగా సమస్యలపై వినతుల అందించగా సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతానని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ 2014 సంవత్సరంలో రాష్ట్రంలో 22.5 మిలియన్ యూనిట్ల లోటుతో చంద్రబాబు పాలన మొదలైందని అటువంటి సమయంలో అనుభవిజ్ఞుడైన నారా చంద్రబాబునాయుడు గారి పరిపాలనలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు గారి సమర్థవంతమైన పరిపాలనలో 2019లో టిడిపి ప్రభుత్వం ఆధ్వర్యంలో మిగులు విద్యుత్ సాయికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. మిగులు విద్యుత్తుతో పాలన ప్రారంభించి ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ మన రాష్ట్రంలో నేడు ఇటువంటి దుస్థితికి రావడానికి కారణం ముమ్మాటికీ జగన్ రెడ్డి చేసిన అవినీతి కక్ష సాధింపు విధానాలే కారణమని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. జగన్ తన హయాంలో తన ఐదేళ్ల హయాంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32వేల కోట్ల మోయలేని భారాన్ని మోపారని తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో మైలవరంలోని సోలార్ ప్లాంట్ల పై దాడి చేసి ధ్వంసం చేశారని చట్ట విరుద్ధంగా పిపిఏలను రద్దు చేయడం వల్ల 7 మెగావాట్లు తక్కువ రేటుకు వచ్చే విద్యుత్ ఉత్పత్తి కోల్పోవడం జరిగిందని అలా కాకుండా వారిని ప్రోత్సహించి ఉంటే వారి అనుభవంతో మరో పదివేల మెగావాట్ల ప్లాంట్లను ఈపాటికి ఉత్పత్తిలోకి తెచ్చి ఉండేవారిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పోలవరం జల విద్యుత్ కేంద్రాన్ని 2021కే పూర్తి చేయకపోవడం వల్ల 4737 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. జన్కో విద్యుత్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడానికి విజయసాయిరెడ్డి సరఫరా చేసిన నాసిరకం బొగ్గు కారణమని నాణ్యమైన బొగ్గు తగినంత నిల్వలు పెట్టుకోకపోవడం వల్ల విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు . ఈ విధంగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పంపిణీ వ్యవస్థను సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి ప్రజలపై మోయలేని భారాన్ని మోపి ప్రజలను మోసంగించి నేడు అధికారం పోయిన తర్వాత విద్యుత్ పై ధర్నాలు చేయడం దొంగే దొంగ అని అరిచినట్లు ఉందని ఇది జగన్ రెడ్డి దిగజారుడు తరానికి నిదర్శనమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాగంటి మిల్లు బాబు, లావేటి శ్రీనివాస్, బొప్పన సుధా, మంచినేని శ్రీనివాసరావు, మోతుకురు నాని, గారపాటి రామసీత, ఉప్పలపాటి రాంప్రసాద్, మహేష్ యాదవ్, శేఖర్, కొండయ్య చౌదరి, తిలక్ సహా పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.