విద్యుత్ చార్జీలను తగ్గించాలి… పి. రామచంద్రయ్య
1 min readభోగిమంటల లో విద్యుత్ చార్జీల ప్రతులను దహనం చేస్తున్న సిపిఐ నాయకులు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. సిపిఐ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం అంబేద్కర్ సర్కిల్ కూడలి లో పెంచిన విద్యుత్ చార్జీల జీవో ప్రతులను భోగిమంటలలో దహనం చేశారు. ఈ సందర్భంగా పి. రామచంద్రయ్య మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు తాము అధికారంలోకి వస్తే విద్యుత్తు చార్జీల భారం తగ్గిస్తామని హామీ ఇచ్చి, అధికారం చేపట్టాక విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై పెనుబారం మోపడం జరిగిందని విమర్శించారు. కూటమి నాయకులు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా సమితి సభ్యులు సురేంద్ర కుమార్, కృష్ణయ్య, మహిళా సమాఖ్య నాయకురాలు జయలక్ష్మి, సాలమ్మ, చంద్రమ్మ, రామాంజి నమ్మ, నాయకులు రవి, అబ్బాస్, హనుమన్న, ప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.