విద్యుత్ ఫిర్యాదుల పరిష్కారానికి గట్టి చర్యలు.
1 min read-ఫిర్యాదుల‌్లేని సేవలే లక్ష్యంగా పనిచేయాలి
– విద్యుత్ శాఖ ఎస్ ఈ. ఎస్ రమణ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : క్షేత్రస్థాయిలో వినియోగదారుల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా విద్యుత్ కు సంబంధించిన అన్ని సేవలను ప్రజలకు అందించేందుకు సిబ్బంది పనిచేయాలని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ రమణ అన్నారు. శుక్రవారం చెన్నూరు 33/11 కెవి సబ్ స్టేషన్, ట్రాన్సఫార్మర్లు, లైన్లను వద్దకు వెళ్లి అక్కడ ఉన్న వాటిని పరిశీలించి విద్యుత్ సిబ్బందికి తగు సూచనలు సలహాలను ఇవ్వడం జరిగింది. అనంతరం ఆయన చెన్నూరు మండల అధికారులు సిబ్బందితో చెన్నూరు విద్యుత్ కార్యాలయంలో సమావేశమై పలు విషయాలపై వారికి అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలకు ఫిర్యాదుల‌్లేని సేవలే లక్ష్యంగా తామంతా పనిచేయాలని తెలిపారు. అలాగే ఒక్క యూనిట్ విద్యుత్ కూడా వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందని ఆయన వారికి సూచించడం జరిగింది.వినియోగదారులు సంస్థ ద్వారా సర్వీస్ పొంది మీటర్ ద్వారానే విద్యుత్ వినియోగించేల చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా విద్యుత్ చౌర్యాన్ని అరికట్టాలని వాలిపోయిన స్తంభాలను, లూజు లైన్లను ఎప్పటికప్పుడు సరిచేయాలని వారిని ఆదేశించడం జరిగింది.తక్కువ ఎత్తులో ఉన్న లైన‌్లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవాలని వారికి తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా పందిళ్ల వద్ద విద్యుత్తు భద్రతా నియమాలు విధిగా పాటించే విధంగా ఆర్గనైజర్లతో సమావేశాలు ఏర్పరచుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సంస్థ నెలరోజుల ముందు విద్యుత్ కొనుగోలు చేసి వినియోగదారులకు ఇస్తుందని, విద్యుత్ బకాయిల వసూళ్లలో రాజీ పడవద్దని ఎప్పటికప్పుడు విద్యుత్ బకాయిలు వసూలు పై దృష్టి సారించాలనివారికితెలియజేశారు.విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉంటూనే విద్యుత్ ప్రమాదాల నివారనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆయన విద్యుత్ అధికారులకు సిబ్బందికి తెలియజేశారు. అంతేకాకుండా విద్యుత్ పొదుపు ప్రమాదాల నివారణ వంటి వాటిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులు చేయాలని ఆయన తెలిపారు.
అంతరాయాలు ఎక్కువ అధికంగా ఉన్నచోట అక్కడ ఉన్న లైన‌్ల లో సమస‌్యలను గుర‌్తించి ముందస‌్తు మరమ‌్మత‌్తులు చేసి అంతరాయలను అరికట‌్టి నిరంతర నాణ్యమైన విద్యుత్ ను ప్రజలకు అందించాలని అధికారులకు తెలియజేశారు.విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉంటు, విద్యుత్ ప్రమాదాల నివారణ లక్ష్యంగా అధికారులు సిబ్బంది పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. విద్యుత్ సిబ్బంది వినియోగదారులతొ మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ వారి విద్యుత్ సమస్యలను సావధానంగా విని పరిష్కరించి సంస్థపై ప్రజలలో సంతృప్తికరస్తాయిని పెంచాలని తెలియజేశారు. అలాగే విధుల్లో అలసత్వం వహించే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని గట్టిగా అధికారులనుసిబ్బందిని ఆయన హెచ్చరించారు.ఈ సమావేశంలో కడప డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఇంజనీర్ రామలింగారెడ్డి, జూనియర్ ఇంజనీర‌్లు స్రవంతి, లావణ్య సిబ్బంది పాల్గొన్నారు.