విద్యుత్ బిల్లు కేంద్రంలో సిబ్బంది లేకపోవడంతో వెనదిరిగిన విద్యుత్ వినియోగదారులు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండల కేంద్రమైన చెన్నూరు ట్రంకు రోడ్ లో ఉన్న విద్యుత్ బిల్లు కేంద్రం వద్ద విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించడానికి గురువారం ఉదయం ఎనిమిది గంటలకే బిల్లు కేంద్రం వద్దకు వినియోగదారులు వచ్చారు. కానీ ఇక్కడున్న బిల్లు ఆపరేటర్ సెలవు పై వెళ్లడంతో గంటల తరబడి వినియోగదారులు ఎదురుచూశారు.11 గంటల వరకు చూసి వినియోగదారులు వెళ్లిపోయారు. ఈ విషయంపై పలువురు వినియోగదారులు విద్యుత్ అధికారులు దృష్టికి తీసుకెళ్లగా బిల్లు కేంద్రంలో పనిచేస్తున్న ఆపరేటర్ లీవ్ పై వెళ్లారని తెలిపారు. విద్యుత్ శాఖ నిబంధనలు ప్రకారం బిల్లు ఇచ్చిన 15 రోజు లోపల బిల్లు చెల్లించనిచో ఎటువంటి అదనపు చార్జీ పడవని నిబంధన ఉంది.15 రోజులు తర్వాత బిల్లు కట్టినచో అదనపు చార్జీలు ఉంటాయని నిబంధన ఉంది. విద్యుత్ బిల్లులు చెల్లించని వినియోగదారుల సర్వీసులు తొలగించబడతాయని విద్యుత్ శాఖ నిబంధన లు గతంలో ఫోన్ పే. గూగుల్ పే ద్వారా నేరుగా విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. విద్యుత్ శాఖ ఇటీవల యాప్ ప్రకటించడంతో యాప్ ద్వారా విద్యుత్ బిల్లులు కొంతమంది చెల్లిస్తున్నారు. చాలామంది విద్యుత్ వినియోగదారులు వెసులుబాటు లేకపోవడంతో చెన్నూరు లో ఉన్న విద్యుత్ బిల్లు కేంద్రం వద్ద చెల్లిస్తున్నారు. చెన్నూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు కేంద్రం వద్దకు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది సెలవు పై వెళ్తే వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు మరో సిబ్బందిని ఏర్పాటు చేయాలని విద్యుత్ వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.