పంట పొలాల్లో లూజు లైన్లను సరి చేస్తున్న విద్యుత్ శాఖ
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: బొల్లవరం గ్రామం లోని పంట పొలాల్లో క్రిందికి వేలాడుతున్న లూజు లైన్లను మండల విద్యుత్ శాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సరి చేసే కార్యక్రమం చేపట్టారు . విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఏఈ తెలిపారు. పంట పొలాలతో పాటు గ్రామాల్లో విద్యుత్తు లైన్లో క్రిందికి వేలాడుతూ ఉంటే రైతులు కానీ గ్రామస్తులు కానీ తమకు తెలియజేస్తే వెంటనే సరిచేసి అవసరమైతే స్తంభాలు ఏర్పాటు చేసే చర్యలు తీసుకుంటామని ఏ ఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎక్కువ ఎత్తులో తరలించే ముఖ్యంగా వరి కోత మిషన్లు, అరటికాయల వాహనాలు, పశుగ్రాసం తరలించే వాహన దార్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి విద్యుత్ వైర్లు మరియు స్తంభాల కు తగలకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.