అర్హులైన పట్టభధ్రులు ఈనెల 6లోగ ఓటర్గా నమోదు చేసుకోవాలి..
1 min readపల్లెవెలుగు న్యూస్ ఏలూరు : తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా నందు ఓటరుగా నమోదుచేసుకునేందుకు ఈనెల 6వ తేదీ బుధవారంతో గడువు ముగుస్తున్నందున అర్హులైన పట్టభధ్రులు వెంటనే సంబంధిత తహశీల్దారు, ఎంపిడివో, మున్సిపల్ కార్యాలయాల్లోగానీ, లేదా ఆన్ లైన్లో గానీ నమోదు చేసుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు తెలిపారు. ఆన్ లైన్ ధరఖాస్తుదారులు ధర్యాఫ్తు అధికారి ఇంటికి వచ్చినప్పుడు ఆన్ లైన్ ధరఖాస్తుపై సంతకం చేసి మరియు గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన డిగ్రీ ధృవపత్రం సహకరించాలని ధరఖాస్తుదారులను కోరారు. అర్హులైన ధరఖాస్తుదారులు వారి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన డిగ్రీ ధృవపత్రం కాపీ నకలు సమర్పించినచో సరిపోవునని వారి పదవ తరగతి, ఇతర విద్యకు సంబంధించిన ధృవపత్రాలు అవసరంలేదని స్పష్టం చేశారు.