వరద బాధితులను ఆదుకోవడంలో మన్న చర్చ్ స్పందన అభినందనీయం
1 min readవేలాది రూపాయలతో నిత్యవసర సరుకులు పంపిణీ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వరద బాధితులను ఆదుకోవడంలో శాంతినగర్ మన్న చర్చ్ దైవజనుల స్పందన అభినందనీయమని ఏలూరు జిల్లా అధికారులు, ప్రజలు అభినందించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో విజయవాడలో వరద బాధితులను ఆదుకునే క్రమంలో మన్న చర్చ్ సభ్యులు సేకరించిన విరాళాలతో నిత్యావసర సరుకులు వరద బాధితులకు, నిరాశ్రయులకు, సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా దైవజనులు రెవరెండ్ జ్యోతి రాజు మాట్లాడుతూ విపత్కర పరిస్థితిలో వరద బాధితులను ఆదుకోవడం మనందరరి బాధ్యత అన్నారు. సంఘ సభ్యులు దాతృత్వంతో సేకరించిన సొమ్ము , నిత్యవసరాలు సహాయ చర్యకులకు వినియోగిస్తామని మీరు చేస్తున్న సహాయం స్ఫూర్తిదాయకం అభినందనీయమన్నారు. ఇదే స్పూర్తితో స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు మెరుగైన సేవలు అందించడంలో ముందుకు రావాలనీ పిలుపునిచ్చారు. మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా చాకచక్యంగా వరద చిక్కుకొన్న మరియు పునరావస బాధితులను ఆదుకోవడం, అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు సహాయ సహకారాలు కార్యక్రమాలు అందించడం గొప్ప విషయం అన్నారు. బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీరు, పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టలు తదితర పరికరాలు గత రెండు రోజులుగా జిల్లా నుంచి పంపడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరులు తల వంతు సహాయ సహకారాలు అందించారు. ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు.