ఏలూరు… వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ
1 min readసహాయ సహకారాలు అందించిన ఏపీఎన్జీవోస్ అధ్యక్ష,కార్యదర్శులు చోడగిరి శ్రీనివాస్, రామారావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాలతో గత మూడు రోజులుగా మూడు షిఫ్టులుగా రోజుకు 2 వేల మంది సేవలందిస్తూ విజయవాడ వరద బాధితులకు టిఫిన్,భోజనం పొట్లాలు తయారుచేసి ఈరోజు వరకు లక్ష మందికి పంపామని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. ఊహకు అందని విధంగా విజయవాడకు జలప్రళయం సంభవించిందని ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించే చర్యల్లో భాగంగా పగలు,రాత్రులు నిరస్రాయులకు నిద్రాహారాలు లేకుండా జోరు వానలో మోకాళ్ళలోతు నీటిలో తిరుగుతూ బాధితులకు నేనున్నానని సీఎం భరోసా ఇచ్చారన్నారు.మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ పిలుపుమేరకు,ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి,మేయర్ నూర్జహాన్ పెదబాబు, సూచనలతో కమిషనర్ మధు ప్రతాప్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా ఉదయం టిఫిన్,మధ్యాహ్నం,రాత్రిపూట భోజనాలు ప్యాకెట్లు చేసి పంపించడం జరుగుతుందన్నారు. ఈరోజు ఇంజనీరింగ్,రెవిన్యూ సెక్షన్ ఒకచోట పదివేల మందికి,శానిటేషన్ సెక్షన్ వారు ఒకచోట 5 వేల మందికి వేరువేరుగా వంటలు చేయించి 15 వేల భోజనం పొట్లాలు పంపించడం జరిగిందని మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏలూరు జిల్లా తరపున నాయకులు చోడగిరి శ్రీనివాసరావు, నెరుసు రామారావు ఆధ్వర్యంలో 5 వేల మందికి సరిపడా బ్రెడ్,వాటర్ బాటిల్స్, ఆయిల్ డబ్బాలు ఎస్ఎంఆర్ పెదబాబు చేతుల మీదుగా వరద బాధితులకు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతోఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి రెండు రోజులుగా విజయవాడలోనే ఉంటూ ఏలూరు నుండి వెళ్లిన ఆహార పొట్లాలు,బ్రెడ్, పాలు,దుస్తులు మొదలగునవి స్వయంగా ఆయనే బాధితులకు అందజేస్తూ, వారి వద్దకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారు. ఏఒక్కరు.దిగులుపడనవసరం లేదని భరోసా ఇస్తున్నారని కో ఆప్షన్ సభ్యులు పెదబాబు అన్నారు. ఏలూరులో కార్పొరేటర్లు మరియు బొద్దాని శ్రీనివాస్ స్వయంగా వచ్చి భోజన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అన్ని విభాగాల సిబ్బంది మెప్మా మహిళలు అద్భుతమైన సేవలు అందిస్తున్నారని పెదబాబు అన్నారు. ఆపద సమయంలో స్వచ్ఛంద సంస్థలు సంస్థలు దాతలు,దాతృత్వం కలిగిన వారు ముందుకు వచ్చి బాధితులకు ఆపన్న హస్తం అందించాలని ఎస్ ఎం ఆర్ పెదబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్పొరేటర్లు బత్తిన విజయ్ కుమార్, జున్నూరు కనక నరసింహారావు, దేవరకొండ శ్రీనివాసరావు,సబ్బన శ్రీనివాసరావు, దారపు తేజ,పాము శామ్యూల్, నున్న కిషోర్,ఈదుపల్లి పవన్,ఆరేపల్లి సత్తిబాబు తదితరులు ఉన్నారు.