PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సదస్సు

1 min read

సంక్షేమం,అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం లోనే జరిగాయి

న్యాయవాదులు వైసిపి ప్రభుత్వానికి సహకరించి గెలిపించాలి

ఫ్యాను గుర్తుకు ఓటేసి గెలిపించాలి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు విజ్ఞప్తి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సదస్సు బార్ అసోసియేషన్ హాలులో గురువారం నిర్వహించారు. బార అసోసియేషన్ అధ్యక్షులు అబ్బీనేని విజయకుమార్ అధ్యక్షతన జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని, ఏలూరు ఎమ్. పి. అభ్యర్థి కారుమూరి సుని కుమార్, వైస్సార్. కాంగ్రెస్ పార్టీ బి. సి. సెల్ జిల్లా అధ్యక్షులు ఘంటా ప్రసాద్, వైస్సార్. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి చిన్నం సుధీర్, వైస్సార్. కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు పితాని దుర్గారావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బి.వి. కృష్ణారెడ్డి వేదికను అలంకరించారు. ఆళ్ల నాని మాట్లాడుతూ న్యాయ విద్య ప్రోత్సాహం కొరకు జూనియర్ లాయర్లకు లాయర్ నేస్తం 5 వేలు జగన్ ప్రభుత్వం అందిస్తుందని, బార్ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మానికి నిధులు, ఏలూరు ప్రజలు ముంపుకి గురికాకుండ కోటి రూపాయలతో రిటర్నింగ్ వాల్ నిర్మాణం, నగరంలో వైద్య విద్యాలయంఏర్పాటు, త్రాగు నీటికై గోదావరి కాలువ వద్ద 110ఎకరాల్లో మంచి నీటి చెరువు, స్టోరేజ్ ట్యాంక్ లు నిర్మాణం, ఇళ్లు లేని పేదలకు 30 వేల ఇళ్లు నిర్మాణం, నూతన మార్కెట్లు, రైతు బజార్లు, నూతన కాలనీలు, తన హయంలో  అనేకమైన నగరభివృద్ధి కార్యక్రమాలు తన హయాంలో జరిగిందని, మధ్య దళారీలు లేని ఇంటికే సంక్షేమం అందించామని ఆళ్ల నాని తెలిపారు. మేధావులు, విద్యాధికులు అయినా న్యాయవాదులు విజ్ఞతతో వాస్తవాలు తెలుసుకొని, అందరూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా ఎమ్.ఎల్.ఏ మరియు ఎమ్. పి. అభ్యర్థులను గెలిపించేందుకు అండగా మిఅందరి సహకారం అందించాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని సమావేశంలో పాల్గొన్న న్యాయవాదులను ఆళ్ల నాని విజ్ఞప్తి చేస్తూ కోరారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున న్యాయవాదులు వైసిపి పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author