PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపి ఏలూరు సమన్వయ కర్త జేపీ ని అభినందించిన సొంగ మధు

1 min read

వైయస్ జగన్ హయాంలో దళితులకు పెద్దపీట

కూటమి ప్రభుత్వంలో ఆ పథకాలు అమలవుతాయన్న  నమ్మకం లేదు

నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర  కమిటీ మెంబర్  మధు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వైయస్సార్సీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో మొక్కవోని అభిమానం గుండెల నిండా ఉందని  నిరూపించారు. ఇటీవల వైఎస్ఆర్సిపి కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు ఏలూరు వైసీపీ నుండి సమన్వయకర్తగా నియమింపబడిన మామిళ్ళపల్లి జయప్రకాష్ ను నవ్యాంధ్ర ఎం.ఆర్.పి.ఎస్ స్టేట్ కమిటీ మెంబర్ సొంగ  మధు ఆయన చాంబర్లో కలిసి పూల గుత్తి అందించి అభినందించారు.  వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త గా మామిళ్ళపల్లి జయప్రకాష్ ని నియమింపబడ్డ నాటినుండి ఏలూరు నియోజకవర్గం లో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అనేకమంది పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆయన్ని కలుసుకొని అభినందించడం కొనసాగుతుంది. ఈ తరుణంలో నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ మెంబర్ సొంగ మధు మామిళ్ళపల్లి ని కలిసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హయంలో దళితులకు పెద్దపీట వేశారని బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వంలో ఆ పథకాలు అమలవుతాయన్న నమ్మకు తనకు లేదని అన్నారు.

About Author