‘ఏలూరు డివిజన్ ఇరిగేషన్’ లో క్రిస్మస్ వేడుకలు
1 min readఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిలకలపాటి దేవప్రకాష్ ఆధ్వర్యంలో కార్యక్రమం
- క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్
పల్లెవెలుగు,ఏలూరు జిల్లా ప్రతినిధి:ఏలూరు డివిజన్ ఇరిగేషన్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిలకలపాటి దేవప్రకాష్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. విచ్చేసిన అధికారులకు పూల బొకే అందించి స్వాగతంతో ఆసీనులను చేశారు.ఈ సెమీ క్రిస్మస్ వేడుకలను గత కొన్ని సంవత్సరాలుగా అధికారులు, కార్యాలయ సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు కుటుంబ సభ్యులతో తరలివచ్చి ఏసుక్రీస్తు జన్మదిన సుమధుర స్తుతి గీతాలు ఆలపించి దేవుని ఆరాధించారు. సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ క్రిస్మస్ సందేశాన్ని అందించి విచ్చేసిన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేసి పలువురు సిబ్బంది ఒకరినొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసు కొన్నారు.ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ రేవు సతీష్ కుమార్, ఎస్టి సంఘ నాయకులు దేవరకొండ వెంకటేశ్వర్లు, ఏలూరు జిల్లా బిజెపి నాయకులు కారంకి శ్రీనివాస్ గౌడ్, పాస్టర్ విజయకుమార్, డి ఈఈ లు సీతారాం,సుజాత, ఇరిగేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.