ఏలూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని గెలుపుకి కృషి చేస్తా
1 min readఇంటింటా సొంగ మధు మాదిగ కరపత్రాలు పంపిణీ
మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలన్నీ కొనసాగు తాయ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మే 13న జరిగే ఎంపీ, ఎమ్మెల్యే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్సీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో (ఎన్డీఏ) కూటమి ఓటయే అంతిమ లక్ష్యంగా మాదిగ మరియు మాదిగ ఉప కులాలు ఏకతాటిపై కొచ్చారు. వైసిపి పార్టీ గెలుపే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా నవ్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆదేశాలను సారం శుక్రవారం దళిత నాయకులు పొలిమేర హరికృష్ణ, సొంగ మధు మాదిగ ఆధ్వర్యంలో ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆళ్ల నాని కరపత్రాలు ఆవిష్కరించరు. డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు, రాష్ట్ర బీసీ నాయకులు ఘంటా ప్రసాదరావు పాల్గొన్నారు. అనంతరం గడపగడపకు వెళ్లి ఫ్యాను గుర్తుపై ఓటేసి ఆళ్ల నాని ని గెలిపించాలని మధు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని ని, ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ ను గెలిపించాలని ఇంటింటా ప్రచార బాట పట్టారు. దాన్లో భాగంగా కార్పొరేటర్లకు, ప్రతినిధులకు కరపత్రాలు అందించి వారితో మమేకమయ్యారు. మరోసారి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అయితేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని ఎస్సీ, బీసీ, మైనార్టీలకు మరియు కులమతాలకతీతంగా ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కార్యక్రమంలోపార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.