PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ తో యువతకు ఉపాధి.. పాణ్యం ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్: రాష్ట్ర ప్రజలు 20 24 ఎలక్షన్లలో టిడిపి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు అధికారం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన విజయవంతంగా నడుస్తుందని శుక్రవారం నాడు ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ కు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేయడంపై పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పారిశ్రామికంగా కూడా స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేయాలని అడుగులు ముందుకు వేయడం జరిగింది దీనికి ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం వల్ల మనకి ఇవి సాధ్యమైనవి గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు  రాష్ట్రాన్ని పారిశ్రామిక స్మార్ట్ సిటీగా రూపుదిద్దడానికి శ్రీకారం చుట్టడం జరిగిందని దాంట్లో భాగంగానే ఓర్వకల్లు ను ఇండస్ట్రియల్ హబ్ గా చేసి ఇక్కడ ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందని కర్నూలు కి 20 కిలోమీటర్ల దూరంలోనే ఓర్వకల్లు ఉండి ఇక్కడ దాదాపు వ్యవసాయానికి ఆమోదయ యోగ్యం కానీ 33 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా గుర్తించడం జరిగిందని చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ లో సోలార్ పవర్ పార్క్ అయితే నేమి ఎయిర్పోర్ట్,జయరాజు ఉక్కు పరిశ్రమ,డి ఆర్ డి ఓ,ఇలా ఎన్నో పరిశ్రమలు తీసుకొని రావడం జరిగిందన్నారు.జూలైలో 23వ తేదీనా కేంద్ర బడ్జెట్ విడుదల చేయడం జరిగింది దాంట్లో ఆ రోజే మన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్  ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్ గా ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగింది. చెప్పిన 50 రోజుల్లో పై  కూటమి ప్రభుత్వం నిధులు కూడా కేటాయించడం అంటే కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ది ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మొత్తం 12 ఇండస్ట్రీస్ కేంద్రం ప్రకటిస్తే దాంట్లో మన ఏపీకి 2 రావడం చాలా సంతోషదాయకం అందులో ఒకటి కడప జిల్లాలోని కొప్పర్తిలో అలాగే ఇంకొకటి మన కర్నూలు జిల్లాలోనిలో ఓర్వకల్లులో ఏర్పాటు చేయడం చాలా అర్హర్షించదగ్గ విషయము దీని ద్వారా ఇక్కడ ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ పరికరాలు ఇలా చాలా అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి కాబట్టి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. నేనొక్కటే తెలియజేస్తున్న ఆరోజు చెప్పిన మాట ప్రకారమే మనకి ఈరోజు మన ఓర్వకల్లులో 2600 ఎకరాలను 2800కోట్లతో ఈరోజు బడ్జెట్ కూడా విడుదల చేసినందుకు నేను ప్రధాన మంత్రి  కి నరేంద్ర మోడీ కి అలాగే ఆర్థిక మంత్రి  నిర్మల సీతారామన్ కి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగానే 45 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది అంతేకాకుండా పరోక్షంగా కూడా లక్షల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి మన ప్రాంతమంతా అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చింత సురేష్ , బిజెపి నాయకులు గంగాధర్ ,నంద్యాల మహిళా అధ్యక్షురాలు కే పార్వతమ్మ  మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి ,కల్లూరు మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు  పాల్గొన్నారు.

About Author