ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలి… సిపిఎం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభల ద్వారా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. పత్తికొండ గ్రామపంచాయతీ ఆఫీస్, పెద్దహుల్తి గ్రామ పంచాయతీ ఆఫీస్ లలో శుక్రవారం గ్రామ సభలు నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ కార్యదర్శి రంగారెడ్డి నాయకులు చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి పెద్దహుల్తి సురేంద్ర పాల్గొని స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా (పెద్దహుల్తీ లో టెక్నికల్ అసిస్టెంట్ కు వినతిపత్రం సమర్పించారు) గ్రామాల్లో వలసలు వెళ్లకుండా నివారించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఉపాధి హామీ పథకంలో ఉన్న కూలీలకు కింది పనులు చేపట్టాలని, చిన్న సన్న కారు రైతుల భూముల్లో రాళ్లు వేరు కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. అలాగే గ్రామాల్లోని స్మశాన వాటిక అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. స్థానికంగా ఉన్న చెరువు పూడికతీత పనులు చేపట్టాలని, యంత్రాలతో పనులు చేయించకూడదని సూచించారు. ఇంకా దాదాపు చాలా రకాలైనటువంటి పనులున్నాయి వాటిని కూలీల ద్వారానే చేసి కాపాడాలని అన్నారు. కూలీలను ఆదుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఎమ్మెల్యే శాంబాబుకు వినతిపత్రంసమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం స్థానిక నాయకులు తాజ్, ప్రభాకర్, గోపాల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.