ఉపాధి..’గోకులం షెడ్ల’లో వేగం పెంచండి
1 min readఎంపీడీఓ దశరథ రామయ్య
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): ఉపాధి హామీ పథకం పనుల్లో రోజూ కూలీల సంఖ్య మరియు గోకులం షెడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని మిడుతూరు ఎంపీడీవో పి దశరథ రామయ్య సిబ్బందితో అన్నారు.అలగనూరు గ్రామంలో గోకులం షెడ్డు నిర్మాణాన్ని ఎంపీడీవో పరిశీలించి.అదే విధంగా గ్రామంలో ఇంకా రెండు గోకులం షెడ్లు నిర్మాణంలో ఉన్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.అదే విధంగా వీటిని త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో లబ్ధిదారులతో మాట్లాడారు. మధ్యాహ్నం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం సిబ్బందితో ఎంపీడీవో సమావేశమై మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి కూలీలకు పనుల పట్ల అవగాహన కల్పిస్తూ కూలీల సంఖ్యను తప్పనిసరిగా పెంచే విధంగా చూడాలన్నారు.జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కూలీల సంఖ్యను తప్పనిసరిగా పెంచాల్సిందేనని అంతే కాకుండా వారికి పనులు కల్పించాలని అన్నారు.రోజూ సగటు కూలీ 3 వందల రూ.లు తక్కువ కాకుండా చూడాలని మరియు ఫారం ఫాండ్,సోక్ పిట్స్ మొదలగునవి త్వరగా పూర్తి చేయాలని సిబ్బందితో అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ భూపన జయంతి, టెక్నికల్ అసిస్టెంట్లు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.