PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజయోస్తు..

1 min read

కిక్​ బాక్సింగ్​ లో పోటీలో దిగనున్న చిన్నారులు

  • క్రీడా దుస్తులు ఇచ్చి.. ఆశీర్వదించిన అన్నపూర్ణమ్మ

కర్నూలు, పల్లెవెలుగు:నగరంలోని మోంటి ఇంటర్నేషనల్​ స్కూల్ లో శనివారం ఉదయం జిల్లా స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీలో పాల్గొనున్న క్రీడాకారులను త్రినాథ్​ అకాడమీ చైర్మన్​ డా. త్రినాథ్ తల్లి అన్నపూర్ణమ్మ ఆశీర్వదించారు. చిల్ర్డన్స్​ విభాగంలో బరిలో దిగనున్న క్రీడాకారులకు  క్రీడా దుస్తులు అందజేసి .. ప్రోత్సహించారు.  .  అంతేకాక కిక్​ బాక్సింగ్ పోటీలో పాల్గొనేందుకు  ఒక్కొక్క క్రీడాకారుడికి ఎంట్రీ ఫీజు రూ.300  చొప్పున అందజేశారు.   ఈ సందర్భంగా అన్న పూర్ణమ్మ మాట్లాడుతూ  క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లా స్థాయిలో విజేతలైన క్రీడాకారులు.. రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని, వారిని కొంత ప్రోత్సహిస్తే ఉత్సాహంగా పాల్గొని విజేతలుగా తిరిగి వస్తారన్నారు. శనివారం జరిగే కిక్​ బాక్సింగ్​ పోటీలో ఉమ్మడి జిల్లా నుంచి 170 మంది క్రీడాకారులు ( చిల్ర్డన్స్​ విభాగం)లో పాల్గొంటారని త్రినాథ్​ అకాడమీ శిక్షణ నిర్వాహకుడు నరేంద్ర తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *